APCOB Staff Assistant Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ APCOB Staff Assistant Recruitment 2025 ద్వారా 13 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ APCOB Staff Assistant Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు 27 ఆగస్టు 2025వ తేదీ నుండి 10 సెప్టెంబర్ 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
Age Limit:
1 జులై 2025వ తేదీ నాటికి 20 సంవత్సరముల నుండి 28 సంవత్సరంల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అంటే అభ్యర్థులు 2 జులై 1997 వ తేదీ నుండి 1 జులై 2005 వ తేదీ మధ్య పుట్టి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 33 సంవత్సరముల వరకు అప్లై చేసుకోవచ్చు.
ఓబీసీ అభ్యర్థులు 31 సంవత్సరంల వరకు అప్లై చేసుకోవచ్చు.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులలో జనరల్ అభ్యర్థులు 38 సంవత్సరంల వరకు, ఓబీసీ అభ్యర్థులు 41 సంవత్సరంల వరకు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 43 సంవత్సరముల వరకు అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి.
అభ్యర్థులకు తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
అభ్యర్థులు ఇంగ్లీష్ పై నాలెడ్జ్ ను కలిగి ఉండాలి.
కంప్యూటర్ నాలెడ్జి కలిగిన అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
Selection Process:
ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీషులో ఉంటుంది. 200 ప్రశ్నలకు గాను 200 మార్కులు చొప్పున 2 గంటల పాటు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4Th నెగిటివ్ మార్కింగ్ ఉంది.
సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2025లో ఎగ్జాంను నిర్వహించడం జరుగుతుంది.
Application Fee:
ఈ APCOB Staff Assistant Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 826 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 590 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
Salary:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 24050 రూపాయల నుండి 64480 రూపాయల మధ్య బేసిక్ పే ఉంటుంది. ఇంకా అదనంగా అలోవెన్సెస్ కూడా ఉంటాయి. అన్ని కలుపుకొని సంవత్సరానికి 7.2 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది.
Official Website: https://apcob.org/?page_id=93
0 కామెంట్లు